సమంత ప్రధానపాత్ర చేసిన యశోద సినిమా రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ తాజా సందేశంలో “నేను చాలా నెర్వస్‌గా ఇంకా ఉన్నాను. ఇంకా ఒక్క రోజే ఉంది. మీ అందరికీ యశోద సినిమా తప్పకుండా నచ్చుతుందని గట్టిగా కోరుకొంటున్నాను. ఈ సినిమాకి సానుకూల స్పందనలు వస్తున్నందున ఈ సినిమా దర్శకులు, నిర్మాత, నటీనటులు, సినిమా టీమ్‌లో ప్రతీ ఒక్కరూ కూడా నాలాగే చాలా ఉద్వేగంగా మీ అందరి తీర్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్ ఫింగర్స్ అండ్ టోస్ క్రాస్డ్ అంటూ సమంత ఓ ఫోటో కూడా పెట్టింది.
సాధారణంగా నిర్మాతలు వందల కోట్లు పెట్టుబడి పెట్టి పెద్ద హీరోలతో పాన్ ఇండియా మూవీ తీస్తుంటారు. కానీ సమంతని పెట్టి హీరోయిన్ ఓరియంటడ్ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీస్తుండటం, ఆమె ప్రతిభకు గుర్తింపు, గౌరవం వంటిదే అని చెప్పవచ్చు.
హరి-హరీష్ దర్శకత్వంలో శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించారు.
ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, శత్రు, మధురిమా, దివ్యా శ్రీపాద, కల్పిక గణేశ్, ప్రియయాంక శర్మ, రాజీవ్ కుమార్ అనేజా ముఖ్యపాత్రలు చేశారు.
సరోగసీ (అద్దె గర్భం) పేరుతో జరుగుతున్న చీకటి వ్యాపారాలని కధాంశంగా తీసుకొని యశోద సినిమా తీసినట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందించారు.