
టాలీవుడ్ హాట్ బ్యూటీ రెజినా కాసాండ్రా ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న ఈ అమ్మడు యువత మనసుని గిలిగింతలు పెడుతుందంటే నమ్మాలి. అయితే అలాంటి అమ్మడు సడెన్ గా తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందన్న వార్తని పేల్చితే ఎలా ఉంటుంది. వామ్మో ఎన్ని అభిమాన గుండెలు ఆగిపోతాయో కదా.. రీసెంట్ గా రెజినా తన ట్విట్టర్ ఎకౌంట్ లో మీ ఆశీర్వాదాలు తప్పనిసరిగా కావాలి.. ఇలా సడెన్ గా జరిగినందుకు నన్ను మీరు క్షమించాలి.. అతను ఎవరో చెప్పాలని ఉంది కాని చెప్పలేను కాని త్వరలోనే అతని పేరు బయటపెడతా అంటూ తన ఎంగేజ్మెంట్ విషయంపై షాకింగ్ ట్వీట్ చేసింది.
అయితే ఇంతలో ఏమైందో ఏమో కాని ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపట్లోనే రెజినా మళ్లీ వాటిని డిలీట్ చేసింది. అసలు ఇంతకీ రెజినా ఎంగేజ్మెంట్ అయ్యిందా అయితే ఎందుకు ఆ విషయాన్ని దాచిపెట్టాలి. ఒకవేళ కమిట్ అయిన సినిమాలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందని వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసిందా అన్న రకరకాల డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా రెజినా మరోసారి దీని గురించి సరైన క్లారిటీ ఇస్తే కాని ఈ తర్జన భర్జన ఆగదు. కెరియర్ ఇప్పుడే మంచి ఊపుమీదున్న ఈ సమయంలో రెజినా అంత తొందరగా పెళ్లి చేసుకోవడం తన ఫ్యాన్స్ కు హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని అవుతుంది. మరి అదే నిజమైతే ఆ లక్కీ వరుడెవరో తెలియాల్సి ఉంది.