
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప2 షూటింగ్ మొదలైంది కనుక ఆ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారికి అదిరిపోయే గొప్ప ధ్రిల్లింగ్ న్యూస్ ఇది. ప్రస్తుతం బాంకాక్లో ఉన్న సుకుమార్ టీం అక్కడి దట్టమైన అడవులలో సినిమా లొకేషన్స్ ఎంచుకొనే పనిలో బిజీగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్ పులికి ఎదురుగా నిలిచి దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చేసిన సీన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, సుకుమార్ కూడా పుష్ప2లో అల్లు అర్జున్‌కి పులితో ఫైట్ సీన్ ఒకటి పెట్టాలని ఫిక్స్ అయ్యారట!
అయితే ఈ సీన్ గ్రాఫిక్స్‌తో కాకుండా నిజం పులితోనే తీద్దామని సుకుమార్ చెప్పడంతో యూనిట్ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. కానీ అక్కడ శిక్షణ పొందిన పులులు లభిస్తాయని వాటితో సినిమాలు తీస్తుంటారని సుకుమార్ చల్లగా చెప్పడంతో అందరికీ చాలా హుషారు వచ్చేసిందిట! కనుక ఇప్పుడు బాంకాక్ అడవుల్లో నిజమైన పులితో అల్లు అర్జున్ ఫైట్ చేయడం దాదాపు ఖాయమే అని భావించవచ్చు. దానికి అల్లు అర్జున్‌కి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారట! పుష్ప మొదటి భాగంలో ఏ జంతువులను చూపకుండానే అల్లు అర్జున్ ఫైర్ పుట్టించేశాడు. ఇక దీనిలో నిజమైన పులితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.