
రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమా వారి సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కనుక మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తే బాగుండునని అభిమానులు కోరుకోవడం అత్యాశ ఏమీ కాదు. కానీ వారి కోరిక నిజంగానే తీరబోతోందిట. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు వారిద్దరి కాంబినేషన్‌లో ఓ 10 నిమిషాల నిడివి ఉన్న హీరో ఇంట్రడక్షన్ సన్నివేశం ఒకటి చిత్రీకరించారని ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ బయటపెట్టారు.
నిజానికి ఈ విషయం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే రాజమౌళి చెప్పారని కానీ అది రంగస్థలం గురించే అనుకొన్నారు తప్ప రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తీయబోతున్న మరో కొత్త సినిమా గురించి అని ఎవరూ గ్రహించలేకపోయారు. ఇప్పుడు సాబు సిరిల్ ఈవిషయం బయటపెట్టడంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందానికి అంతే లేదు. కానీ వారిద్దరి కాంబోలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలీదు.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ ధర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా దర్శకుడు సుకుమార్- అల్లు అర్జున్‌తో పుష్ప2 మొదలుపెట్టేశాడు. కనుక వచ్చే ఏడాదిలో ఎప్పుడో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో మళ్ళీ మరో రంగస్థలం మొదలవుతుందేమో?
Koncham sepu hype💉 ekkinchukundam🔥🥵#RC16 #Ramcharan #ManOfMassesRamCharan pic.twitter.com/vbn5CwNWav
— M@NI Charan🔥🦁 (@Always_mani333) November 2, 2022