అతనితో డేటింగ్ పై శ్రీయా ఏమన్నదంటే..!

దాదాపు 15 సంవత్సరాలుగా హీరోయిన్ గా ఒకే రేంజ్ ఫాంలో ఉన్న శ్రీయ మళ్లీ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను చేస్తూ వార్తల్లో నిలిచింది. తన మొదటి సినిమాలో ఎలా ఉందో ఇప్పటికి అలాంటి నాజూకుగా ఉన్న శ్రీయా తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ బ్రేవోతో డేటింగ్ లో ఉన్నదని ముంబాయ్ మీడియా ఒకటే హడావిడి చేసింది. ఇద్దరు కలిసి డిన్నర్ కు వెళ్లిన ఫోటోలతో బ్రేవోతో శ్రీయా డేటింగ్ అంటూ హెడ్ లైన్స్ వేశారు. 

అయితే బ్రేవోతో తను డేటింగ్ లో లేని అది కాజువల్ గా జరిగిన మీటింగ్ అంతే కాదు తను ఎవరితో డేటింగ్ లో లేను అలా చేయాలనే ఆలోచన కూడా లేదు అని తెగేసి చెప్పింది శ్రీయా. దశాబ్ధ కాలంపైగా సౌత్ సిని ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు మధ్యలో ఎవరెవరితోనో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అన్న వార్తలు వచ్చినా ప్రస్తుతం మళ్లీ తాను ఒంటరి పక్షినే అంటూ వయ్యారాలు పోతుంది.  

ఇక ముదురు భామలంతా ఓ పక్క పెళ్లికి సిద్ధమవుతున్నా తన మాటల ప్రస్థావనలో ఎక్కడ కనీసం పెళ్లి ఊసే ఎత్తట్లేదు. మరి అమ్మడు పెళ్లి మీద ఏ ఆలోచనలో ఉందో తెలియాల్సి ఉంది. చడి చప్పుడు కాకుండా సడెన్ గా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని షాక్ ఇస్తుందేమో చూడాలి.