ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-2 మంచి హుషారుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, ఆయన కుమారుడు, తన అల్లుడు నారా లోకేష్‌లతో బాలయ్య ఓ ఆట ఆడుకొని షోని మరో లెవెల్‌కి తీసుకుపోయారు. తాజాగా ఈ షోలో యువహీరోలు శర్వానంద్, అడవి శేష్ రాగా వారిద్దరితో కూడా బాలయ్య ఓ ఆట ఆడుకొన్నారు. వారిరువురూ కూడా బాలయ్యను సరదాగా ఆట పట్టించారు. ఈ నెల 4వ తేదీన ప్రసారం కాబోయే ఆ ఎపిసోడ్‌కి సంబందించిన ప్రమోని ఆహా సంస్థ విడుదల చేసింది.
అడవి శేష్ ఎంట్రీ ఇస్తూ బాలయ్య పాదాలకు నమస్కరించబోతే “ఆ వద్దు వద్దు పిల్లలు దేవుడితో సమానం అంటారు... నువ్వు నా కాళ్ళకు దణ్ణం పెట్టకూడదు...” అంటే, “అదేంటి సార్ పెద్దలు దేవుడితో సమానం అంటారు కదా అందుకే...” అంటూ అడవి శేష్ ఏదో చెప్పబోతుంటే శర్వానంద్ కలుగజేసుకొని “ఆయన బాలయ్య... అంటే చిన్న పిల్లవాడు...” అంటూ సెటైర్ వేసి నవ్వులు పూయించారు.
ఆ తర్వాత ప్రశ్న-జవాబుల కార్యక్రమంలో “సెల్ఫీ అడిగితే చెంప పగులగొట్టే హీరో ఎవరు? బాలకృష్ణ ప్రశ్నించడంతో ఇద్దరూ ఏం చెప్పాలో తెలియక నవ్వుకొన్నారు. బాలయ్య జనాల మద్యకు వెళ్లినప్పుడు అభిమానులు మీదపడినా, సెల్ఫీలు కోసం ఎగబడినా ఆగ్రహంతో వారి చెంపపగులగొడుతుంటారని అందరికీ తెలిసిన విషయమే. కనుక బాలయ్యే శర్వా, అడవి శేష్లను ఈ ప్రశ్న అడగడటమే ఈ షోలో విశేషం. ఇంకా రష్మిక వీడియో కాల్, మీరేంత చెప్పినా ఎడిటింగ్ ఆ చేతిలోనే ఉంటుందనే బాలయ్య డైలాలతో ఈ ఎపిసోడ్ చాలా హుషారుగా సాగినట్లు ప్రమో చూస్తే అర్దమవుతుంది.