తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన కేరళ నటీమణులలో నిత్యామేనన్ కూడా ఒకరు. ఆమె చాలా తక్కువ సినిమాలలో నటించినప్పటికీ వాటితోనే మంచిపేరు తెచ్చుకొంది. ఆమె తన అభిమానులకు చిన్న షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ కిట్ (గర్భధారణను నిర్దారించే పరికరం) ఫోటోని పోస్ట్ చేసి “అద్భుతం మొదలైంది” అని చిన్న కామెంట్ దానిపక్కనే ప్రేమ చిహ్నాన్ని తెలియజేసే ఓ ఇమోజీ పోస్ట్ చేశారు. అది చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. మీకు పెళ్ళెప్పుడయిందని కొందరు నేరుగా ఆమెనే అడిగేశారు కూడా. కొంతమంది నిత్యామేనన్ నిజంగానే తల్లి కాబోతోందని భావించి అభినందనలు తెలియజేశారు. కానీ అది ఆమె చేయబోయే ఓ సినిమా ప్రమోషన్ కోసమని తర్వాత తెలిపింది.
నిత్యామేనన్, మరో మలయాళీ నటి పార్వతితో కలిసి ‘వండర్ విమెన్’ అనే ఓ సినిమా చేయబోతోంది. దాని కధాంశం మాతృత్వానికి సంబందించినది. కనుక నిత్యామేనన్ ఇటువంటి ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత కొందరు మాతృత్వాన్ని ఈవిదంగా అపహాస్యం చేయడం సరికాదంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, రానా ప్రధానపాత్రలతో వచ్చిన భీమ్లానాయక్, ధనుష్ హీరోగా వచ్చిన తిరు సినిమాలలో నిత్యామేనన్ నటించి ప్రేక్షకులను మెప్పించింది.