
కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుధ్ అసలైతే ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇవాల్సింది కాని ఇక్కడ అవకాశం వచ్చిన టైంలోనే అక్కడ బిజీ కావడం చేత అవకాశం వదులుకున్నాడు. త్రివిక్రం అఆ సినిమాకు అసలు ముందు అనుకుంది అనిరుథ్ నే.. కాని లేట్ అవుతుందని మిక్కి జే మేయర్ తో కానిచ్చేశారు. అయితే రీసెంట్ గా తన బర్త్ డే నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు పని చేస్తున్న విషయాన్ని కన్ఫాం చేశాడు అనిరుథ్. త్రివిక్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు తను సంగీతం అందిస్తానని అన్నారు.
సో ఒకసారి త్రివిక్రం అవకాశం చేజారిన మళ్లీ అదే త్రివిక్రం ఛాన్స్ అందుకున్నాడు అనిరుథ్. వై దిస్ కొలవెరి డి అంటూ ప్రపంచం మొత్తాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగేలా చేసిన అనిరుథ్ తెలుగులో చేస్తున్నందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని మ్యూజిక్ కూడా సినిమాకు యాప్ట్ అయ్యేలా కొత్తగా చేస్తానని అన్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే త్వరలోనే త్రివిక్రం పవర్ స్టార్ కాంబో మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పేయొచ్చు.
ఇప్పటికే కాటమరాయుడుతో పాటుగా ఏ.ఎం.రత్నం ప్రొడక్షన్లో తమిళ దర్శకుడు నేసన్ డైరక్షన్లో సినిమా ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు త్రివిక్రంతో కూడా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.