అమెజాన్ ప్రైమ్‌లో మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్

దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రొజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాకు మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత నిలద్రొక్కుకొని మంచి కలక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా నవంబర్‌ 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈవిషయం ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. 

తమిళనాడులో అత్యంత పాఠకాధారణ పొందిన కల్కి కృష్ణమూర్తి వ్రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఆ నవలను సినిమాగా తీయాలని దర్శకుడు మణిరత్నం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు హేమాహేమీలైన నటీనటులతో అత్యద్భుతంగా సినిమాగా తెరకెక్కించారు. చోళ చక్రవర్తి కాలంలో జరిగిన కధాంశంతో ఈ సినిమా రూపొందింది. పొన్నియన్ సెల్వన్ నవల ఎంతగా ప్రజాధారణ పొందిందో, ఆదేపేరుతో మణిరత్నం తీసిన సినిమాకు కూడా అంతే ప్రజాధారణ లభించింది. ముఖ్యంగా తమిళ ప్రజలు తమ గొప్ప చారిత్రిక గొప్పదనాన్ని చూసి మురిసిపోతున్నారు. 

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, శరత్ కుమార్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభితా దూళిపాళ, రహమాన్, ప్రభు, ఆర్‌.పార్ధీబన్,  తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కెమెరా: రవి వర్మన్, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, సంగీతం ఏఆర్ రహమాన్ అందించారు. 

ఈ సినిమాను మణిరత్నం, శుభకరన్ ఆలీరాజ్ కలిసి మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నిర్మించారు. సుమారు రూ.500 కోట్లుపైగా ఈ సినిమా కలక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నవంబర్‌ 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.