ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్ 2024, జనవరి 12న విడుదల కాబోతోందిని తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకొంటుండటం వలన సినిమా విడుదలకు అంత సమయం తీసుకోవలసివస్తోంది.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ఆదిపురుష్ రన్ టైమ్ మూడు గంటల 15 నిమిషాలని దాని సారాంశం. సినిమా ఫస్ట్-లుక్, టీజర్‌పైనే అనేక విమర్శలు వచ్చినప్పుడు, అన్ని గంటల సేపు ఆదిపురుషుడు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలడా? అని అప్పుడే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే టీజర్‌ని, దానిలో రూపాలను చూసి తమ సినిమాను తక్కువ అంచనా వేయవద్దని, ప్రేక్షకులను అన్ని విదాలా మెప్పించే విదంగా సినిమా ఉంటుందని దర్శకుడు ఓం రౌత్ నమ్మకంగా చెపుతున్నారు. దీనిని అత్యద్భుతమైన గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీన్స్‌తో త్రీ-డీలో తీస్తున్నందున ఆదిపురుష్ ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తాడని చెపుతున్నారు.
ఓం రౌత్ వాదన నిజమే అయ్యుండవచ్చు కానీ ఆదిపురుష్‌లో శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు తదితరుల రూపాలని, వారి వస్త్రధారణను ఇప్పుడు మార్చలేడు కదా? కోట్లాదిమంది హిందువులు మనసులో ప్రతిష్టించుకుపోయిన వారి రూపాలతో ఏమాత్రం పోలికలేని సరికొత్త రూపాలతో ఆదిపురుష్ మెప్పించగలాడా? ప్రేక్షకులను థియేటర్లో అంతసేపు కూర్చోబెట్టగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు బహుశః ట్రైలర్లో దొరుకుతుందేమో చూద్దాం.