
రావడం రావడం ఒకేసారి మూడు హిట్లు కొట్టేసరికి ఇక తానో సూపర్ స్టార్ అయ్యాననే ఫీలింగ్ వచ్చింది ఓ కుర్ర హీరోకి. ఇంకేముంది రెక్లేస్ ప్రవర్తనతో సీనియర్లని కూడా టీజ్ చేయడం వెటకారంగా మాట్లాడటం జరిగింది. అయితే సినిమా నీళ్లు పడలేదేమో కొత్త కదా అని అనుకున్నారు కాని మనోడి ప్రవర్తనలో ఇంకా ఎలాంటి మార్పు రాకపోయే సరికి ఇక కాన్సెంట్రేట్ చేస్తే ఇప్పుడు అతని పరిస్థితి అయోమయంలో పడింది.
ఇంతకీ ఎవరా హీరో అంటే కుర్ర హీరో రాజ్ తరుణ్ అని తెలుస్తుంది. హ్యాట్రిక్ హిట్ కొట్టేసరికి తల బిరుసు తనంతో సీనియర్ల అవకాశాలను కూడా కాదన్నాడు. ఇక ఇప్పుడు తను చేసే సినిమాలు ఏవేవో కారాణాల వల్ల లేట్ అవుతున్నాయి. అసలైతే అనీల్ సుంకరతో మూడు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజ్. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయ్యింది కూడా కాని అవుట్ పుట్ మీద అసంతృప్తిగా ఉన్న నిర్మాత అనీల్ సినిమా కొద్దిరోజులు ఆపాడట. అంతేకాదు రీసెంట్ గా సునీల్ తో ఈడు గోల్డ్ ఎహే సినిమా ఫ్లాప్ తో నిర్మాతకి లాస్ వచ్చిందని టాక్.
ఇక సంజన రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ సినిమా చేయాల్సింది. అది కూడా అటకెక్కేసిందని అంటున్నారు. మారుతి కూడా రాజ్ తరుణ్ కోసం ఓ కథ సిద్ధం చేసి దర్శకుడి వేటలో ఉన్నాడని అన్నారు. తీరా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పోయిందని టాక్. ఇలా వచ్చిన అవకాశాలన్ని విభిన్న కారణాలతో బ్రేక్ అవ్వడంతో డైలమాలో పడ్డాడు రాజ్ తరుణ్. మరి ఇక్కడ ఎలా ఉండాలో ముందే తెలుసుకుని వస్తే మంచిది లేదంటే ఇలాంటి షాకులే తగులుతాయి అని అంటున్నారు సినిజనాలు.