నయనతార, విగ్నేష్ శివన్ దంపతుల
సరోగసి (అద్దె గర్భం) ద్వారా కవల పిల్లలను పొందడంపై కార్చిచ్చులా మొదలైన వివాదం అంతే
వేగంగా చల్లారిపోయింది. సరోగసి నిబందనల ప్రకారం వారిరువురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్న
5 ఏళ్ళ తర్వాత, వైద్యుల అనుమతి, పర్యవేక్షణలో తమ సమీప బంధువైన ఓ మహిళ
ద్వారా కవలలను పొందారు. దీనికి సంబందించిన అన్ని దృవపత్రాలను వారు తమిళనాడు ప్రభుత్వం
ఏర్పాటుచేసిన విచారణ కమిటీకి సమర్పించడంతో వారు వాటిన్నిటినీ పరిశీలించి నయన్-విగ్నేష్
దంపతులు ఎటువంటి తప్పు చేయలేదని, చట్టవిరుద్దంగా వ్యవహరించలేదని
నిర్దారించుకొని వారికి క్లీన్ చిట్ ఇచ్చేరు కూడా.
దీనిపై
నయన్-విగ్నేష్ దంపతులు తమ ఇన్స్టాగ్రామ్‌లో ఈ వ్యవహారంలో తమను విమర్శించినవారికి సున్నితంగా
చురకలు వేస్తున్నట్లు రెండు కొటేషన్స్ పెట్టారు. దానితో పాటు ఇద్దరూ తమ పిల్లలను ఎత్తుకొన్న
ఫోటోలను కూడా అభిమానులకు షేర్ చేశారు.
ఇంతకీ
వారు ఏం కొటేషన్స్ పెట్టారంటే, “మనం ద్వేషాన్ని, వ్యతిరేక భావనలను ఎంత వేగంగా వ్యాపింపజేస్తామో
అంతే వేగంగా ఫ్రేమను కూడా వ్యాపింపజేయగలిగితే ఈ లోకం ఎంత గొప్పగా ఉంటుందో కదా?”
“అన్నివేళలా మందులతోనే ఆరోగ్యం రాదు. చాలాసార్లు మనశాంతి, హృదయంలో శాంతి ఉన్నపుడే ఆరోగ్యం వస్తుంది. ప్రేమ, మనస్పూర్తిగా నవ్వే నవ్వులో నుంచి ఆరోగ్యం వస్తుంది,” అనే కొటేషన్ పెట్టారు.