చూడముచ్చటగా... మన సూపర్ స్టార్ వారసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలున్నప్పటికీ నేటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఆరడుగుల అందగాడుగా అందరినీ ఆకట్టుకొంటూనే ఉన్నారు. ఆయన కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితార ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి అందరికీ తెలుసు. 

ఇటీవల సీతార తన తండ్రి నటించిన ‘సర్కారువారి పాట’ సినిమా కోసం ఓ ప్రమో వీడియో సాంగ్ కూడా చేసి అందరి ప్రశంశలు అందుకొన్న సంగతి తెలిసిందే. గౌతమ్ కృష్ణ కూడా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనొక్కడినే’ సినిమాలో బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. 

గౌతమ్ ఇప్పుడు ఆరడుగుల ఆజానుబాహువుగా ఎదిగాడు. తండ్రిని మించిన చక్కటి రూపంతో కనబడుతున్నాడు. అయితే హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం రాలేదు కానీ వస్తే తప్పకుండా అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమే అని చెప్పవచ్చు. 

దీపావళి పండుగ తర్వాత వచ్చే బాయి దూజ్ వేడుకలో గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకొంటుండగా తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు. మరి సినిమాలలోకి ఎప్పుడు వస్తారో... అభిమానులను ఎప్పుడు అలరిస్తారో... తండ్రితో కలిసి ‘మనం’ వంటి ఘట్టమనేని ఫ్యామిలీ సినిమాలో ఎప్పుడు నటిస్తారో?