కాపీ రైట్ వివాదంలో కాంతారా

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కాంతారా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని తుళునాడులో భూతకోల తెగ ప్రజల సాంప్రదాయాలను సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకొనేవిదంగా చూపడంతో ఉత్తరాది ప్రజలు కూడా ప్రశంశిస్తున్నారు. ఇక దక్షిణాదినా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో ఋషబ్ శెట్టి చేసిన వరాహ రూపం పాట, దానికి అతను చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే అతనికి ఇంత పేరు ప్రతిష్టలు నిర్మాతలకు డబ్బు సంపాదించిపెడుతున్న కాంతారకు కాపీ రైట్ వివాదంలో చిక్కుకొంది. తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ బృందం ఆ సినిమాలోని వరాహ రూపం పాట, తమ నవరసలోని ఆ వరాహరూపం పాటను పోలి ఉందని, కనుక ఇది కాపీ రైట్ కిందే వస్తుందని వాదిస్తున్నారు. త్వరలో తాము కాపీ రైట్ చట్టం కిండా కాంతారా టీమ్‌కి లీగల్ నోటీసులు పంపబోతున్నట్లు తైక్కుడం బ్రిడ్జ్ తెలిపింది.