ఏంటి జిన్నా కలెక్షన్స్ అంత దారుణంగా ఉన్నాయా?

మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోని ప్రధానపాత్రలలో రూపొందిన జిన్నా సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జిన్నాకు నెగెటివ్ టాక్ రాలేదు కానీ యావరేజ్ టాక్ వచ్చింది కనుక కలెక్షన్స్ కూడా యావరేజ్‌గానే ఉండొచ్చనుకొంటే, తొలిరోజు కలక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. భారత్‌లో అన్ని భాషలలో కలిపి తొలిరోజున కేవలం రూ.16 లక్షలే రాగా, అమెరికాలో 17 ప్రాంతాలలో 50 స్క్రీన్స్ వేయగా కేవలం 493 డాలర్లు అంటే రూ.40,692 మాత్రమే వసూలు అయినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ కేవలం రూ.5కోట్లుకాగా తొలిరోజున కేవలం రూ.16,40,692 మాత్రమే కలక్షన్స్ సాధించడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. అయితే నేడు, రేపు వారాంతపు సెలవులు, తర్వాత దీపావళి సెలవు కలిసి వచ్చినందున జిన్నా కలక్షన్స్ పుంజుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మూడు రోజులలో కూడా కలక్షన్స్ పెరగకపోతే జిన్నాకు కష్టమే.  

జిన్నాలో నటీనటులు మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోని, రఘుబాబు, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,  ఉమేశ్ కౌశిక్ తదితరులు.  

దర్శకుడు: ఈషాన్ సూర్య, నిర్మాత: మోహన్ బాబు, కధ: కోన వెంకట్, కెమెరా: ఛోటా కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్.