
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో వాళ్ళిద్దరూ చేసిన నాటు...నాటు, నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. పుష్పలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్స్, తగ్గేదేలే అంటూ చెప్పిన డైలాగ్ దేశవిదేశాలలో చాలా మందే చేసి చూపారు కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన నాటు...నాటు పాటను ఇంతవరకు ఎవరూ చేసి చూపలేకపోయారు. ఎందుకంటే ఆ పాట స్పీడుని అందుకోవడం, డానికి తగ్గట్లుగా వారిలా డ్యాన్స్ చేయడం చాలా కష్టం గనుక. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నిన్న జపాన్లో విడుదలైన సందర్భంగా అక్కడ ఓ యువజంట నడిరోడ్డు మీద ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకొన్నారు. ఓ తెలుగు సినిమాకు విదేశాలలో తెలుగువారు ఆదరించడం గొప్ప విశేషం కాదు కానీ విదేశేయులు సైతం మన తెలుగు సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తుండటం గొప్ప విషయమే కదా? ఈ జపాన్ జంట చేసిన డ్యాన్స్ చూస్తే వాళ్ళు కూడా మహానాటే అని అర్దం అవుతుంది.
After the interview with @AlwaysRamCharan @tarak9999 @ssrajamouli, for #RRR release in Japan,
— まよ🇮🇳日印つなぐインフルエンサー (@MayoLoveIndia) October 20, 2022
we got so excited and made another video on the way back home😂@RRRMovie @RRR_twinmovie
#NaatuNaatu #RRRInJapan
Thank you @kaketaku85 for always having my back! pic.twitter.com/bOzax8TNcu