
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం ధమాకా! ఈ దీపావళికి ముందే ధమాకా సృష్టిస్తామంటూ చిత్ర యూనిట్ మాస్ క్రాకర్ పేరుతో టీజర్ విడుదల చేసింది. ధమాకా పేరుకు తగ్గట్లుగానే టీజర్‌లో రవితేజ స్టయిల్లో ఫైట్లు, పంచ్ డైలాగులు మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించేలా ఉన్నాయి. “నాకు మీలో విలన్ కనిపిస్తే నాలో హీరో బయటకి వస్తాడు”, “అటు నుంచి ఒక్క బులెట్ వస్తే ఇటు నుంచి దీపావళే...” వంటి డైలాగ్స్ ఆకట్టుకొంటున్నాయి.
ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నపాత్రలలో నటిస్తున్నాడు. ఒకటి మద్యతరగతి వ్యక్తిగా మరొకటి సూటుబూటు వేసుకొని చాలా స్టయిలిష్గా తీర్చిదిద్దాడు దర్శకుడు నక్కిన త్రినాధరావు. దీనికి ముందు వచ్చిన ‘ఖిలాడే’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ ఈ సినిమాపై చాలా ఆశలుపెట్టుకొని చేస్తున్నాడు.
ధమాకాలో తనికెళ్ళ భరణి, రావు రమేష్, అలీ, ప్రవీణ్, చిరాగ్ జానీ, హైపర్ ఆది, జయరాం, సచిన్ ఖేడేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ధమాకా నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్; బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
పాటలు: రామజోగ్గయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సుద్ధాల అశోక్ తేజ్, సంగీతం: భీంస్ సెసీరోలియో, కొరియోగ్రఫీ: శేఖర్ విజే జానీ మాస్టర్
కెమెరా: కార్తీక్ ఘట్టమనేని; స్టంట్స్: రామ్, లక్ష్మణ్
వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మరో రెండు సినిమాలు రవితేజ ఒకేసారి చేస్తున్నాడు. ఈ రెండుకాక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగిల్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేయబోతోంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జాన్‌విక్’ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం.