హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం యశోద. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఇవాళ్ళ యశోద రిలీజ్ పోస్టర్ విడుదల చేసింది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఇంతవరకు పెద్ద హీరోల సినిమాలు మాత్రమే తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తుండటం చూశాము. కానీ తొలిసారిగా సమంత హీరోయిన్గా చేస్తున్న ఈ యశోదను కూడా పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తుండటం గమనిస్తే ఆమెపై దర్శక, నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్దం అవుతుంది. యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Make way for #Yashoda in theatres on Nov 11th 2022🔥

Releasing Worldwide in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @PulagamOfficial @SrideviMovieOff pic.twitter.com/zULpF49ywP
— Samantha (@Samanthaprabhu2) October 17, 2022