
సీనియర్
నరేష్ ముగ్గురు భార్యల తర్వాత పవిత్రా లోకేష్‌తో మరోసారి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
వారిద్దరూ చాలా ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు... ఆమె కూడా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో
జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అయితే బెంగళూరులో వారిద్దరూ ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆమెను చెప్పుతో కొట్టబోయినప్పటి నుంచి వారిద్దరి మద్య దూరం
పెరిగినట్లు సమాచారం. అప్పుడు నరేష్ తనకు గట్టిగా సపోర్ట్ చేయకుండా తన పరువుప్రతిష్టల
గురించే ఆలోచించుకొన్నాడని అందుకే పవిత్ర లోకేష్ ఆయనకు దూరం పెట్టడం మొదలుపెట్టిందని
ఊహాగానాలు వినిపించాయి. ఈ మద్యన రమ్య రఘుపతి మళ్ళీ నరేష్ ఇంట్లో కనిపించినట్లు ఊహాగానాలు
వినిపిస్తున్నాయి. అంటే పవిత్రా లోకేష్ నుంచి నరేష్ దూరం అయ్యారు కనుకనే రమ్య మళ్ళీ
ఇంటికి తిరిగివచ్చిందా లేక పవిత్రా లోకేష్‌తో చెడింది గనుకనే
మళ్ళీ రమ్య నరేష్‌తో కలిసి కాపురం చేసేందుకు తిరిగి వచ్చారా? తెలీదు కానీ నరేష్, పవిత్రా లోకేష్ మద్య బందం ముగిసినట్లే ఉంది.