ఆదిపురుష్‌ గురించి నేను ఆ కామెంట్ చేయలేదు: విష్ణు

మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆదిపురుష్‌ టీజర్‌ చూసి చాలా నిరాశ చెందాను. ప్రభాస్‌ శ్రీరాముడుగా చేస్తున్నందున మంచి యాక్షన్ ఉంటుందనుకొంటే యానిమేషన్‌తో సరిపెట్టేశారు. టీజర్‌ చూసి మోసపోయినట్లు అనిపించింది,” అని అన్నారని వార్తలు వచ్చాయి.

ప్రభాస్‌ సినిమా గురించి  మంచు విష్ణు ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రభాస్‌ను అభిమానులు మండిపడుతున్నారు. దీంతో మంచు విష్ణు వెంటనే ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మరో నకిలీ వార్త! పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది?జీవితంలో కొంత ఆనందించండి. 21న జిన్నా చూడండి. సానుకూలంగా ఉండండి. నిజాలను తెలుసుకొని వ్రాయండి,” అని ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. మరో మెసేజ్‌లో “మై డార్లింగ్ ప్రభాస్‌ నుంచి తన బెస్ట్ రావాలని కోరుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు.     

 తన జిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు విష్ణు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించబోతున్నట్లు తెలిపారు. ఇవాళ్ళ అక్టోబర్‌15న వరంగల్‌, అక్టోబర్‌ 16న కరీంనగర్‌, హైదరాబాద్‌లోని జిన్నా జాతర, అక్టోబర్‌ 17న విజయవాడ, గుంటూరు, అక్టోబర్‌ 18న నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, అక్టోబర్‌ 19న కడప, కర్నూల్ పర్యటించబోతున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అక్టోబర్‌ 20న హైదరాబాద్‌లో జిన్నా ప్రీమియర్ షో వేసి, అక్టోబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు.