
రామాయణగాధ ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. రామాయణగాధ ఆధారంగానే మరో సినిమా రామసేతు ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో పౌరాణికం కాదు. సైన్స్ ఫిక్షన్ కధగా వస్తోంది. ఆనాడు శ్రీరాముడు లంకను చేరుకోవడానికి రామేశ్వరం వద్ద సముద్రం మీద నిర్మించిన రామసేతు వారధికి సంబందించిన ఓ రహస్యాన్ని కనుగొనే కధాంశంతో ఈ సినిమా సిద్దం అయ్యింది. కనుక ఊహించినట్లే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ట్రైలర్‌లో స్పష్టమైంది.
దీనిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో నటించాడు. నాజర్, సత్యదేవ్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, నుష్రాచ్ భరూచా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వం ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, అభూన్‌దంతానియా ఎంటర్‌టైన్‌మెంట్, ప్రైమ్ వీడియో, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లలో నిర్మించారు.