
కీర్తి సురేష్ తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. మహానటి సినిమాలో తెలుగువారు ఎంతగానో అభిమానించే సావిత్రి పాత్ర చేసి ప్రజల మనసులలో ఆమె కూడా మహానటిగా స్థానం సంపాదించుకొన్నారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆమెకు కలిసిరాలేదు. మహేష్ బాబుతో సర్కారువారి పాట, రజనీకాంత్‌తో అన్నత్తే, ఇంకా చాలా సినిమాలలో చేసింది కానీ వాటిలో ఏ ఒక్కటికీ హిట్ అవకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఇంతవరకు కీర్తి సురేష్ అనేక మంది పెద్ద హీరోలతో సినిమాలు చేసినా ఇంకా కెరీర్లో నిలద్రొక్కుకోలేకపోవడంతో చాలా ఆశ్చర్యకరమే.
అందుకే ఆమె పూర్తిగా తన స్టయిల్ మార్చేసింది. శరీర బరువు తగ్గించుకొని, స్లిమ్‌గా తయారై ఫోటో షూట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకొంది. ఆ ఫోటోలను చూస్తే ఈమె కీర్తి సురేషేనా కాదా? అనే అనుమానం కలుగుతుంది. అంతగా ఆమె రూపం మారిపోయింది. వాటిని చూస్తే అందాల ప్రదర్శనకు సిద్దమని దర్శక నిర్మాతలకు సిగ్నల్ ఇచ్చేసినట్లే అర్దమవుతోంది. మరి ఆమెకు ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. నాని హీరోగా చేసిన దసరా సినిమాలో ఆమె హీరోయిన్గా చేస్తోంది. బోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా మరో సినిమా చేస్తోంది. ఇవి కాక మరో రెండు సినిమాలు కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి. కనుక వాటిలో ఏదో ఓ సినిమాతో కీర్తి కెరీర్ మళ్ళీ గాడిన పడే అవకాశం ఉందనే భావించవచ్చు.