త్వరలో మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మొదలైన #MB28 మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి చనిపోవడంతో  రెండో షెడ్యూల్ నిలిచిపోయింది. మహేష్ బాబు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ హరిద్వార్‌లో పూజలు చేసి తల్లి అస్థికలు గంగలో కలిపివచ్చిన సంగతి తెలిసిందే. తాను ఎంతగానో ప్రేమించే తల్లి మరణంతో తీవ్ర దుఃఖంతో ఉన్న మహేష్ బాబు ఇప్పుడిప్పుడే కొలుకొంటున్నారు. కనుక త్వరలో మళ్ళీ షూటింగ్ ప్రారంబిద్దామని త్రివిక్రమ్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. కనుక ఈ నెల మూడో వారం నుంచి అంటే 20, 21 తేదీలలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించేందుకు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మద్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కనుక ఈసారి షూటింగ్ ప్రారంభిస్తే సినిమా పూర్తయ్యేవరకు పెద్దగా బ్రేక్ తీసుకోకుండా ఇద్దరూ పనిచేసే అవకాశం ఉంది.

 ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. లైగర్‌ హీరోయిన్ అనన్యా పాండే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతున్నట్లు తాజా సమాచారం.  

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.