విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమయాత్రకు?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన మద్య గీతా గోవిందం నుంచి లవ్ అఫైర్ నడుస్తోందని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. “అబ్బే... అటువంటిదేమీ లేదు జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే...” అని రష్మిక చెపుతున్నప్పటికీ, విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే తన్మయత్వంలో మునిగిపోతూ “విజయ్ అంటే నాకు చాలా ఇష్టం...” అని చెపుతుంటుంది. 

ఈరోజు ఉదయం వారిద్దరూ కొన్ని నిమిషాల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వెళుతూ మీడియాకు చిక్కారు. మొదట రష్మిక మందన రాగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను పలకరించారు. ఆమె కూడా వారిని పలకరించి బై చెపుతూ లోపలకి వెళ్లిపోయింది. 

ఆ తర్వాత కొద్దిసేపటికి విజయ్ దేవరకొండ కూడా విమానాశ్రయం వద్ద కారు దిగిలోనికి వెళుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే వారిద్దరూ ఫోన్‌లో కబుర్లు చెప్పుకోవడమే తప్ప కలవలేకపోతున్నారు. కనుక ఇద్దరికీ బ్రేక్ దొరకడంతో ప్రేమయాత్రకని మాల్దీవులకు వెళుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో సోషల్ మీడియాలో వారు ఫోటోలు పెట్టినట్లయితే వారి ప్రేమాయణం కన్ఫర్మ్ అయినట్లే భావించవచ్చు. 

విజయ్ దేవరకొండ లైగర్‌ ఫ్లాప్ తర్వాత సమంతతో కలిసి ఖుషీ సినిమా మొదలుపెట్టబోతుండగా, రష్మిక మందన అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది. తర్వాత సినిమాలు మొదలుపెట్టేలోగా ఇద్దరూ మాల్దీవులకు బయలుదేరినట్లున్నారు.