
మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రంలో అందాలభామ అనసూయ ఓ కీలకపాత్ర చేసింది. కానీ ఆమె సినిమా ప్రమోషన్స్‌లో పెద్దగా కనిపించలేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైంది కానీ హటాత్తుగా భారీ వర్షం కురవడంతో ఆ కార్యక్రమంలో చిరంజీవి ఆమె గురించి చెప్పడం మరిచిపోయారు. దాంతో ఆమె తనపై అలిగిందని చిరంజీవి స్వయంగా చెప్పారు. అయితే ట్విట్టర్‌లో ఓ అభిమాని ఆ సినిమాలో మీరు అద్భుతంగా నటించారు. కానీ ప్రమోషన్స్‌లో ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ, “థాంక్స్ ఆండీ! మీరు నమ్మాలి! చాలా షూట్స్ ఒకేసారి జరుగుతున్నాయి. మీ అందరినీ అలరించేందుకు నేను చాలా కష్టపడుతున్నాను. అందుకే,” అంటూ ట్వీట్ చేసింది.