జిన్నా ట్రైలర్‌... మంచు విష్ణు ఈజ్ బ్యాక్!

మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన జిన్నా సినిమా ట్రైలర్‌ నిన్న అంటే బుదవారం గాడ్ ఫాదర్‌, ది ఘోస్ట్ మూవీలతో పాటు థియేటర్లలో విడుదలవడం విశేషమే. 

ట్రైలర్‌ చూస్తే మంచు విష్ణు మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి కామెడీ, యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్దమవుతుంది. ఈ సినిమాలో విష్ణు పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. కానీ జిన్నా అంటూ కాలరేగరేస్తుంటాడు. ఇంకా ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ కనీసం రెండు మూడు భాషల్లో విడుదలవుతున్నాయి కనుక ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నీలిచిత్రాలలో నటించిన సన్నీ లియోన్ ఓ ప్రధాన పాత్ర చేసింది.   
ఈషన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన జిన్నా సినిమాకు కోన వెంకట్ కధ, స్క్రీన్-ప్లే అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.