ఒకే ఒక జీవితం... సోనీలివ్‌లో ...

శర్వానంద్, ప్రియదర్శిని, అక్కినేని అమల, రీతువర్మ, వెన్నెల కిషోర్, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర ప్రధాన పాత్రలలో నటించిన ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్‌ 9వ తేదీన థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో విడుదలై నెలరోజులు పూర్తవుతున్నందున ఇప్పుడు ఈ సినిమా సోనీలివ్‌లో అక్టోబర్‌ 10వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ అందించిన డైలాగులు, జెక్స్  బిజోయ్ అందించిన సంగీతం కూడా చాలా బాగున్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు కలిసి ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో మంచి మార్కులు సంపాదించుకొన్న ఒకే ఒక జీవితం సినిమాకి ఓటీటీ ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.