
వరుస హిట్లతో ఓ రేంజ్ ఫాంలో ఉన్న నాని ఇప్పుడు మరో డేరింగ్ డెశిషన్ తీసుకోబోతున్నాడట. సినిమా మీద తనకున్న ఇష్టంతో ముందు అసిస్టెంట్ డైరక్టర్ గా చెరి ఆ తర్వాత సడెన్ గా హీరోగా మారిన నాని ఇప్పుడు నిర్మాతగా మారాలని అనుకుంటున్నాడట. తన టేస్ట్ కు తగ్గట్టు సినిమాలు తీసేందుకే నాని ఇలా సొంతంగా ప్రొడక్షన్ పెట్టబోతున్నాడట. అయితే తను మాత్రమే కాకుండా తన రిలేటివ్స్ తో ఈ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నాడట నాని.
ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమకు సొంతంగా ఓ బ్యానర్ ఏర్పాట్ చేసుకున్నారు. వారి లెక్క ప్రకారం ఓ ఏరియా రైట్స్ మొత్తంగా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదంటే సినిమా ఓ ఏరియా తమ బ్యానర్లో రిలీజ్ చేయడం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ ఎం.బి ప్రొడక్షన్ రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ఉండనే ఉంది. సో హీరోలుగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా మారుతున్న ఈ హీరోల లిస్ట్ లో ఇప్పుడు నాని కూడా చేరిపోయాడు.
ఇక తన నిర్మాణంలో చేసే మొదటి సినిమా అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమాకు కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా బ్యానర్ రిజిస్ట్రేషన్ వగైరా పనులు కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయి నిర్మాతగా మారాలని చూస్తున్నాడు నాని. మరి నాని తీసుకుంటున్న ఈ కొత్త టర్న్ తనకు ఏ విధంగా సక్సెస్ లను ఇస్తుందో చూడాలి.