
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా చేస్తున్న సినిమా దసరా. అయితే ఈ సినిమా రేపు దసరా పండుగనాడు విడుదలవడం లేదు. వచ్చే ఎడ్డాది మార్చి 30వ తేదీన రిలీజ్ అవుతోంది. అయితే సినిమాకి దసరా పేరు పెట్టుకొన్నారు కనుక రేపు దసరా పండుగ సందర్భంగా ‘ధూమ్ ధామ్’ అనే ఓ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటకి కసర్ల శ్యామ్ చక్కటి తెలంగాణ సాహిత్యం అందించారు కానీ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తమిళ వ్యక్తి కావడంతో ఏదో తమిళపాట వింటున్నట్లే ఉంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీతో ఈ డాన్స్‌ను పక్కా తమిళ సినిమా డాన్స్‌లా మార్చేశారు. అయితే సిల్క్ బార్ వద్ద సాగే సాంగ్ కనుక చాలా నాటుగా మోటుగా కూడా ఉంది. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. దీనిలో నాని బొగ్గుగాని కార్మికుడిగా చేస్తున్నాడు కనుక నాచురల్ స్టార్ పేరు సార్ధకం చేసుకొంటాడని భావించవచ్చు.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, జారీనా వాహేబ్, షమ్నా ఖాసీం , రోశన్ మాథ్యూ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కెమెర: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.