ఈడియట్.. ఒంటరిగా పడుకోవాల్సివస్తోంది: అనసూయ

ప్రముఖ యాంకర్, నటి అనసూయ మళ్ళీ నెటిజన్స్‌కి చేతి నిండా పని కల్పించింది. నువ్వు ఊరెళ్ళినప్పుడు ఒంటరిగా పడుకోవలసివస్తోంది...ఈడియెట్! అంటూ మంచం మీద తన తన భర్త సుశాంక్ భరద్వాజ్ పడుకొనేవైపు ఓసారి అసంతృప్తిగా చూసి ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ముద్దుగా విసుక్కొంటున్న వీడియోని తన ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో క్షణాలలో వైరల్ అయ్యింది. ఇదివరకు నెటిజన్స్ ఆమెను చాలాసార్లు ఓ ఆటఆడేసుకొన్నారు. చివరికి వారితో వేగలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవలసివచ్చింది. ఆ కేసు ఇంకా నడుస్తుండగానే అనసూయ మళ్ళీ ఈ వీడియో పెట్టి నెటిజన్స్‌కి చేతి నిండా పని కల్పించింది. ఇప్పుడు దీనిపై ఎటువంటి కామెంట్స్ వస్తాయో తేలికగానే ఊహించుకోవచ్చు. కనుక మళ్ళీ ట్రోలింగ్ మొదలైపోయింది. కనుక మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ గడప తొక్కక తప్పదేమో?