గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌... చిరు ఇరగదీశాడుగా

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుదవారం సాయంత్రం అనంతపురం పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. 

గాడ్ ఫాదర్‌ సినిమాను రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, దీవి వద్యా, దర్శకుడు పూరీ జగన్నాథ్ తదితరులు నటించారు. ఫాదర్‌ సినిమాకి ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందించారు. అక్టోబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్‌ విడుదలకాబోతోంది.