లైగర్ సినిమాతో ‘దునియాకో వాట్ లగాదెంగే’ అని గొప్పగా ప్రచారం చేసుకొంటే ఆ సినిమాయే దర్శకుడు పూరీకి ‘వాట్ లగాదియా’ అని అందరూ వెనక నవ్వుకొంటున్నారు. లైగర్ డిజాస్టర్ పంచ్ పడేసరికి పూరీ ఎంతో ముచ్చటపడి ముంబైలో తీసుకొన్న విలాసవంతమైన ఇంటికి అద్దె కట్టలేక ఖాళీ చేయాల్సివచ్చిందని తెలుస్తోంది.
దాని అద్దె నెలకి 10 లక్షలు, మెయింటెనెన్స్ ఇతర ఖర్చులు మరో రూ.5 లక్షలు కలుపుకొని మొత్తం రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీసిన లైగర్ తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, అప్పుడు బాలీవుడ్ నిర్మాతలు, నటీనటులు తన వద్దకు క్యూకడతారనే గట్టి నమ్మకంతోనే పూరీ జగన్నాథ్ అంత ఖరీదైన ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.
లైగర్ సినిమా హిట్ అవకపోయినా పెట్టిన పెట్టుబడి తిరిగితెచ్చుకొన్నా ఆయన అంచనాలు నిజమైఉండేవేమో?కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో తీవ్రంగా నష్టపోయిన బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఆ నష్టాన్ని పూడ్చమని పూరీపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఆ ఒత్తిళ్ళు భరించలేక తాను తీసుకొన్న పారితోషికం వాపసు చేశాడు. ఇప్పుడు అద్దె కట్టలేక పూరీ జగన్నాథ్ ఇంటిని ఖాళీ చేయాల్సివచ్చింది.
కధలో బలంలేకుండా విజయ్ దేవరకొండని ముందుంచుకొని ఏదో హడావుడి చేసేస్తే సినిమా హిట్ అవుతుందా?అవదు కనుక లైగర్‌తో అందరూ మునిగిపోయారు.
Rumours Suggest Director #PuriJagannadh Has Been Forced To Vacate His Posh Mumbai Sea-Facing Flat After #Liger Failed At The #BoxOffice@purijaganhttps://t.co/zqPfGmWWTb
— Box Office Worldwide (@BOWorldwide) September 8, 2022