సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప-1 సూపర్ డూపర్ హిట్ అవడంతో దాని రెండో భాగం పుష్ప-2 షూటింగ్ ఎప్పుడు మొదలయి పూర్తవుతుందా అని అందరూఎదురు చూస్తున్నారు. పుష్ప-2లో కూడా అల్లు అర్జున్తో జత కట్టబోతున్న రష్మిక మందన, హిందీలో బిగ్-బి అమితాబ్ బచ్చన్ కూతురిగా గుడ్ బై అనే ఓ సినిమా పూర్తిచేసింది. దాని ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నప్పుడు, విలేఖరులు పుష్ప-2 షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? అని ప్రశ్నించగా మరో రెండు రోజులలో మొదలవుతుందని సింపుల్గా చెప్పేసింది. అల్లు అర్జున్ అమెరికా పర్యటనలో ఉండగా, మళ్ళీ ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో అల్లు అర్జున్ లేకుండానే పుష్ప-2 పూజా కార్యక్రమం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ ఫ్రీ అయ్యారు కనుక ఆమె చెప్పినట్లు పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.