
బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగులో బ్రహ్మాస్త్రం) సినిమా ప్రెస్మీట్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. రూ.450 కోట్ల బారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం ప్రమోషన్ వీడియో విడుదల చేశారు. దాని గురించి వివరించడం కంటే కళ్ళతో చూసి ఆనందించడమే మంచిది.