
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిలిం ఛాంబర్) పరిశ్రమలో అన్ని వర్గాలతో నెలరోజులుగా చర్చలు జరిపిన తర్వాత శుక్రవారం కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఆ వివరాలు క్లుప్తంగా..,
• ఇప్పటి వరకు హీరో హీరోయిన్లు, దర్శకులకు మాత్రమే ముందుగా ఒప్పందాలు చేసుకొని పారితోషికాలు చెల్లించేవారు. ఇక నుంచి సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఇదే విధానంలో నిర్మాతలు పారితోషికాలు చెల్లిస్తారు. కానీ జూనియర్ ఆర్టిస్టులు, కొన్ని సన్నివేశాలలో సాధారణ ప్రజలలా తిరుగుతూ కనిపించే ఆర్టిస్టులకు ఎప్పటిలాగే డైలీ వెజ్ పద్దతిలో షూటింగ్ ముగియగానే డబ్బు చెల్లిస్తారు.
• నటీనటులకు సహాయకులుగా వచ్చేవారి అన్ని ఖర్చులను నటీనటులే భరించుకోవాలి.
• కాల్షీట్స్ ప్రకారం నటీనటులు షూటింగ్‌లకు హాజరుకావలసి ఉంటుంది. దీని కోసం సినిమా షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా రిపోర్ట్ నమోదు చేయాలి.
• ఓ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయిన తర్వాత గానీ అది ఎప్పుడు, ఏ ఓటీటీలో విడుదల కాబోతోందనే వివరాలు ప్రకటించకూడదు. సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేసుకోవలసి ఉంటుంది.
• థియేటర్లలో వర్చువల్ ప్రింట్ ఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 6న డిజిటల్ సర్వీస్ ప్రొవైడ ర్స్‌తో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోబడుతుంది.
• ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒకేవిదంగా చెల్లింపులు ఉంటాయి.
• సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయి.