త్వరలో ధనుష్ ‘తిరు’ ఓటీటీలోకి

కోలీవుడ్ నటుడు ధనుష్, నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలలో తమిళంలో రూపొందిన తిరుచిట్రపళమ్, (తెలుగులో తిరు) ఆగస్ట్ 18న విడుదలై సూపర్ హిట్ అయ్యి వంద కోట్లుపైగా కలెక్షన్స్ రాబట్టింది. 

మిత్రన్ ఆర్‌ జవహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమవుతోంది. సెప్టెంబర్‌ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్స్ట్ ఓటీటీలలో ఒకేసారి ప్రసారం కాబోతోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం, కెమెరా వర్క్ ఓం ప్రకాష్ అందించారు.  

ఈ చిత్రంలో ధనుష్ ఓ డెలివరీ బాయ్‌గా నటించాడు. తాత (భారతీరాజ్) తండ్రి (ప్రకాష్ రాజ్)తో కలిసి జీవిస్తుంటాడు. తాతతో చక్కటి అనుబందం ఉంటుంది కానీ తండ్రితో పడదు. తిరుకి చిన్నప్పటి స్నేహితురాలు నిత్యా మీనన్. తిరు ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్ అతని ప్రేమను తిరస్కరిస్తారు. అప్పుడు తిరు జీవితంలో ఊహించని విదంగా మలుపు తిరుగుతుంది. 

తెలుగులో ఈ సినిమా చూస్తున్నప్పటికీ ఏదో తమిళ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. అంత స్ట్రాంగ్‌గా తమిళ నేటివిటీ ఉంటుంది. ధనుష్ ఎప్పటిలాగే మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. నిత్యా మీనన్ పాత్ర చాలా ఆకట్టుకొంటుంది.