వేలు పెట్టుడు ఎక్కువైందటగా..!

9 ఏళ్ల తర్వాత సినిమాతో అభిమానుల అలరించాలనే ఉత్సాహంతో చిరంజీవి సినిమా కోసం అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఓ టాక్. అంతేకాదు సినిమా మాత్రుకలోని కొన్ని సీన్స్ తీసేసి తన అభిమానులను ఉద్దేశించి కొన్ని ఎక్స్ ట్రా మసాల సీన్స్ పెడుతున్నారట. అయితే అవి కాస్త అసలు కంటెంట్ చెడగొట్టేలా ఉన్నాయని ఇన్నర్ టాక్. ఖైది నెంబర్ 150తో బ్యాక్ టూ ఫాం వచ్చేయాలనే తాపత్రయంలో ఉన్న చిరంజీవి సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. 

అదే రేంజ్లో సినిమాలో వేలు పెట్టడం కూడా ఎక్కువైందట. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆశతో ఉన్న చిరు దాని కోసం లేని పోని బిల్డప్ సీన్లు యాడ్ చేయమని చెబుతున్నాడట. మరి ఇలా కిడిచి చేసేస్తే అక్కడ హిట్ కొట్టిన సినిమా ఫలితం ఇక్కడ వేరేలా వచ్చే అవకాశం ఉంటుంది. చరణ్ నిర్మాత కాబట్టి తన ఓన్ ప్రొడక్షన్ లో తనకు నచ్చినట్టుగా సినిమా షూట్ చేస్తు వెళ్తున్నారట. 

మరి తీసుకునే జాగ్రత్తలు, జోడించే ఎక్స్ ట్రీ సీన్స్ ఆడియెన్స్ కు ముఖ్యంగా అభిమానులకు నచ్చితే ఓకే లేదంటే చిరు ఉన్నా బ్రూస్ లీ ఫలితం ఎలా వచ్చిందో అలాంటి రిజల్ట్ నే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ విషయాన్ని గమనించి చిరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.