యశోద కొత్త పోస్టర్‌ వచ్చేసింది... త్వరలో టీజర్‌ కూడా!

సమంతను తెరపై చూసి చాలాకాలమే అయ్యింది. చివరిగా పుష్పలో ‘ఊ అంటావా మావా...’ అంటూ అందరినీ ఉర్రూతలూపింది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, హరి-హరీష్ దర్శకత్వంలో ‘యశోదా’ చిత్రాలు ప్రారంభించి చాలా కాలమే అయ్యింది కానీ వాటి నుండి తాజా అప్‌డేట్స్ రాకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. కనుక వారి కోసం యశోద సినిమా నుంచి శుక్రవారం ఓ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో సమంత స్వల్పగాయాలతో మహిళల మద్య నడుస్తున్నట్లు చూపారు. అదే పోస్టరులో ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5.49 గంటలకు యశోద టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.  

సమంత ప్రధాన పాత్రలో థ్రిల్లర్ జానర్‌లో శ్రీదేవీ మూవీస్ పతాకంపై యశోద చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్నారు.