హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ శుక్రవారం సాయంత్రం

రేపు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 5.45 గంటలకు హరిహర వీరమల్లు సినిమాలో ‘పవర్ గ్లాన్స్’ విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొద్ది సేపటి క్రితం ట్విట్టర్‌లో ప్రకటించారు. “స్వాగతిస్తుంది సమరపధం... దూసుకొస్తుంది వీరమల్లు విజయరధం...’ అంటూ వ్రాస్తూ నల్ల దుస్తులు, ఎర్రటి కండువా కప్పుకొని రధం నడుపుతున్న పవన్‌ కళ్యాణ్‌ ఫోటో అభిమానులతో షేర్ చేసుకొన్నారు. 

హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరిగిన కధగా తీస్తున్నారు. రూ.120-200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్న ఈ సినిమాను ఏ దయాకర్ రావు మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.   

హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ పవన్‌ కళ్యాణ్‌ జంటగా నటిస్తోంది. బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చిలో విడుదలకాబోతోంది.