బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీస్

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు చారిత్రిక నేపద్యం ఉన్నందున పన్ను రాయితీ పొందింది. కానీ ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా పూర్తి టికెట్ ఛార్జీలు వసూలు చేశారు. కనుక ప్రభుత్వం నుంచి పొందిన ఆ పన్ను రాయితీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని బాలకృష్ణను ఆదేశించవలసిందిగా కోరుతూ తెలుగు ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం బాలకృష్ణతో సహా ప్రతివాదులకు ఈరోజు నోటీసులు జారీ చేసింది.