మహేష్-త్రివిక్రమ్ సినిమాలో తరుణ్?

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ28 చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. దీనిలో ఓ ముఖ్యపాత్రకు తరుణ్‌ని తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టిన తరుణ్ ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో దర్శకనిర్మాతలు తరుణ్‌ని పూర్తిగా మరిచిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తరుణ్ కనిపించబోతున్నాడు. తరుణ్ చేసిన ‘నువ్వే నువ్వే’ సినిమాతో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో తరుణ్‌కి సెకండ్ లైఫ్ ఇవ్వాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. మహేష్-త్రివిక్రమ్ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.     సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హాసిని అండ్ హారిక క్రియెషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.