సంబంధిత వార్తలు

కొత్త దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా రూపొందిన చిత్రం రంగరంగ వైభవంగా. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి మరోపాట “కొత్తగా లేదేంటి... కొత్తగా లేదేంటి...” అంటూ సాగే ఓ మంచి రొమాంటిక్ సాంగ్ ఈరోజు విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమని లిరిక్స్ అందించగా, దేవీశ్రీ సంగీతంలో అర్మన్ మాలిక్, హరీప్రియ ఆలపించారు.
ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ మూవీఈలో సుబ్బరాజు, ప్రగతి, నవీన్ చంద్ర, ప్రభు, నరేష్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను బాపిపినీడు సమర్పిస్తున్నారు.