
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదలై తొలిరోజునే నెగెటివ్ టాక్ రావడంతో బోర్లా పడింది. దీంతో రవితేజ ఫ్లాప్ సినిమాల జాబితాలో రామారావు ఆన్ డ్యూటీ కూడా చేరింది. ఇది రవితేజకు 68వ సినిమా. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న నటీనటులే చక్కటి కధలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉన్న రవితేజ నేటికీ సరైన కధను ఎంచుకోవలేక చతికిలపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులు తిరస్కరించిన ఈ సినిమా ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణుకి కూడా ఇది ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంష కౌశిక్, రాజీష విజయన్ నటించగా తనికెళ్ల భరణి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, రాహుల్ రామ కృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.