ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌లో సమంత ఎల్టీటీఈ సానుభూతిపరురాలిగా చాలా అద్భుతంగా నటించింది. ఆ వెబ్ సిరీస్‌తో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అయితే దానిలో సమంత కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేసింది. ఆమె కాపురం కూలిపోవడానికి అవే కారణమనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు అది అప్రస్తుతం.
అమెజాన్ ప్రైమ్ కోసం ప్రత్యేకంగా ‘సిటాడెల్’ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్ తయారవుతోంది. దీనిని భారతీయ భాషలలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్, డికెలు తీశారు. ఈ వెబ్ సిరీస్‌లో హాలీవుడ్ నటులు రిచార్డ్ మాడెన్, రోలాండ్ మోల్లర్, స్టాన్లీ టుస్సీ తదితరులతో బాలీవుడ్ నటులు ప్రియాంకా చోప్రా, వరుణ్ ధావన్, సమంత కలిసి నటించారు. దీనికోసం సమంత అమెరికన్ స్టంట్ మాస్టర్స్ నుంచి మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ తీసుకొంది. ఆమెతో పాటు మిగిలిన నటీనటులు కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ‘సిటాడెల్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భారతీయ భాషలలో విడుదల కానుంది.