
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో తెలుసు. ఆ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో అగ్రహీరోలలో ఒకడైపోయాడు. ఆ సినిమా కధ, దానిలో విజయ్ దేవరకొండ పాత్ర, దాని తీరు, అతని నటన అన్నీ సరికొత్తగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు దానిని సూపర్ హిట్ చేశారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే హిందీలో షహీద్ కపూర్, కియరా అద్వానీ జంటగా కబీర్ సింగ్ పేరుతో తీయగా అది సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో తీస్తే అది సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ విడుదలైన సందర్భంగా అర్జున్ రెడ్డిలో ఎడిట్ చేసి తొలగించిన ఓ సన్నివేశాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి విడుదల చేశాడు. 2.23నిమిషాల నిడివిగల ఆ వీడియో క్లిప్‌లో విజయ్ దేవరకొండ-రాహుల్ రామకృష్ణ మద్య సాగిన సంభాషణ ఉంది. దానిలో తాను హీరోయిన్ ప్రీతి (షాలిని పాండే)ని ముద్దుపెట్టుకోవడం, అప్పుడు ఆమె తండ్రి తనతో గొడవపడటం గురించి ఇద్దరి మద్య సాగిన సంభాషణ దానిలో ఉంది. ఆ వీడియో మీకోసం....