రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన జీ5 ఓటీటీలో విడుదల కాబోతోంది.
అనూప్ బండారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జాక్ మంజూనాథ్ సుమారు రూ.95 కోట్లు వ్యయంతో నిర్మించారు. దీనిలో నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ బండారి, మధుసూధన్ రావు తదితరులు నటించారు. ఒక ఊరులో ఓ పాడుబడ్డ ఇంట్లో ఓ రాక్షసుడు ఉంటాడని ఊర్లో జనాలు నమ్ముతుంటారు. ఓ రోజు ఆ ఇంటి ముందున్న బావిలో ఆ ఊరి ఇన్స్పెక్టర్ శవం దొరుకుతుంది. అతని హత్యపై దర్యాప్తు మొదలుపెట్టిన విక్రాంత్ రోణకు మరో దిగ్బ్రాంతి కలిగించే విషయం తెలుస్తుంది. ఆ ఊరిలో అనేకమంది చిన్న పిల్లలు హత్యకు గురయ్యారని తెలుసుకొని ఈ హత్యల వెనుక మిస్టరీని చేదించడానికి పూనుకొంటాడు. ఊర్లో పిల్లలను ఎవరు హత్యలు చేశారు? ఎందుకు చేశారు?ఈ మిస్టరీని విక్రాంత్ రోణ ఏవిదంగా చేధించాడు? అనేది ఈ సినిమా కధ.