
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ రేపు (ఆగస్ట్ 25)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు లైగర్ ఫస్ట్ రివ్యూను క్లుప్తంగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
“మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయించే మూవీ లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేశాడు. యాక్షన్, స్టంట్స్, దర్శకత్వం చాలా అద్భుతంగా ఉన్నాయి. రమ్యకృష్ణ పాత్ర చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కధ, స్క్రీన్ ప్లే యావరేజ్,” అని ట్వీట్ చేశారు.
ఈ సినిమాకు పూరీ ఎంచుకొన్న పాయింట్ ఓ సాధారణ యువకుడు ప్రపంచస్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌గా ఏవిదంగా ఎదిగాడని. కనుక దీనిలో కధ కంటే స్క్రీన్ ప్లేదే చాలా కీలకపాత్ర అవుతుంది. కానీ అది యావరేజ్‌గా ఉందని ఉమైర్ సంధు చెప్పడం కాస్త నిరాశ కలిగించే విషయమే. కానీ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షోతో సినిమాను పరుగులు పెట్టించాడని చెప్పడం ఊరటనిస్తుంది.
ఈ సినిమాకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ప్రమోట్ చేసి హైప్ క్రియేట్ చేసినందున లైగర్‌పై ప్రేక్షకుల అంచనాలు చాలా భారీగా పెరిగిపోయాయి. ఒకవిదంగా ఇది సినిమాకు చాలా ప్లస్ పాయింట్, మరోవిదంగా మైనస్ పాయింట్ అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున తొలివారంలోనే భారీ కలక్షన్లతో లాభాలు వస్తాయి. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో వాటికి ఏమాత్రం తగ్గినా సినిమా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కానీ లైగర్ కలెక్షన్లలో ఛాంపియన్‌గా నిలుస్తాడనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు.