వరుణ్ తేజ్‌తో సహజీవనం గురించి లావణ్య త్రిపాఠి ఏమందంటే

అందాల రాక్షసితో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన బాలీవుడ్‌ భామ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌తో సహజీవనం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. “వరుణ్ తేజ్‌తో నేను రెండే రెండు సినిమాలు చేశాను. ఆయన ఒక మంచి స్నేహితుడే తప్ప మా మద్య ఎటువంటి బందమూ లేదు. కానీ మేము సహజీవనం చేస్తున్నామంటూ పుకార్లు పుట్టించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నిజానికి నేను పబ్బులు, క్లబ్బులకు, పార్టీలకు కూడా వెళ్ళను. సినిమా షూటింగులు లేకుంటే ఇల్లు అంతే. ఇండస్ట్రీలో నా గురించి అందరికీ తెలుసు. అయినా ఇటువంటి పుకార్లు భరించాల్సివస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేసింది. 

టాలీవుడ్‌లో తన ప్రస్థానం గురించి మాట్లాడుతూ “ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడినమాట వాస్తవం. కానీ మెల్లమెల్లగా అందరితో పరిచయాలు పెరిగి ఇండస్ట్రీలో ఎలా మసులుకోవాలో తెలుసుకొన్నాక చాలా బాగానే ఉందిప్పుడు. టాలీవుడ్‌ నా సెకండ్ హోమ్‌గా భావిస్తున్నాను. సినిమా హిట్ అయితే ఎవరికైనా సంతోషమే కానీ ఫ్లాప్ అయితేనే జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు వాటినీ లైట్ తీసుకోగలుగుతున్నాను. కనుక లైఫ్ హ్యాపీగానే సాగిపోతోంది,” అని లావణ్య త్రిపాఠి చెప్పింది.