
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా కంప్లీట్ చేసుకోగానే మరోసారి తనకు శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివతో కలిసి పనిచేయబోతున్నాడు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఆ సినిమా కోసం పూర్తి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమాలో మహేష్ జోడిగా ఒక్కరు కాదు ఇద్దరిని పెట్టబోతున్నాడట శివ. తను తీసిన మూడు సినిమాల్లో కేవలం శ్రీమంతుడు ఒక్క దానిలోనే ఒక్క హీరోయిన్ తో సరిపెట్టిన కొరటాల శివ రీసెంట్ జనతా గ్యారేజ్ లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ను ఉంచాడు.
ఇప్పుడు అదే సెంటిమెంట్ తో కథానుసారంగా డబుల్ హీరోయిన్స్ ను దించబోతున్నారట. అయితే ఆ లక్కీ హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తేల్చలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న కొరటాల శివ ఇంకా హీరోయిన్స్ సెలెక్షన్ దాకా వెళ్లలేదట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉంటుందని తెలుస్తుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హిట్స్ అందుకున్న కొరటాల శివ మహేష్ తో చేయబోయే మూవీని కూడా మరో బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. జనవరిలో స్టార్ట్ చేయబోతున్న ఆ సినిమాను త్వరగానే పూర్తి చేసి వచ్చే ఏడాది దసరాకి ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.