
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అంటే యూత్ లో ఓ ఫాలోయింగ్ ఉంది. తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న త్రివిక్రం తనకు నచ్చిన సినిమాల పట్ల కూడా అదే రేంజ్లో రెస్పాండ్ అవుతాడు. రీసెంట్ గా అవసరాల శ్రీనివాస్ తీసిన జ్యో అచ్యుతానంద మూవీ చూసిన త్రివిక్రం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ను మెచ్చుకున్నాడట. అంతేకాదు తన నిర్మాణంలో అవసరాలకు డైరక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఓ పక్క నటుడిగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అవసరాల శ్రీనివాస్ మరో పక్క దర్శకుడిగా కూడా మంచి అభిరుచిని ప్రదర్శిస్తున్నాడు.
మొదటి సినిమా పర్వాలేదు అనిపించుకున్న శ్రీని రెండో సినిమాకు తన సత్తా చాటాడు. అందుకే త్రివిక్రం లాంటి డైరక్టర్ తన ప్రొడక్షన్ లో సినిమాకు అవసరాలను ఎంచుకున్నాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ త్రివిక్రం నిర్మాణంలో చేసే సినిమా కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అంతేకాకుండా తను హీరోగా బాలీవుడ్ హంటర్ రీమేక్ గా వస్తున్న సినిమాకు కూడా రెడీ అవుతున్నాడు. ఓ పక్క దర్శకుడిగా హిట్లు కొడుతూ మరో పక్క నటుడిగా శ్రీనిని చూస్తుంటే లక్ అంటే అతనిదే అని చెప్పుకోవాలి.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు త్రివిక్రం చేతిలో పడ్డాడు కాబట్టి స్టార్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరికినట్టే. మరి త్రివిక్రం శ్రీని కాంబినేషన్లో వస్తున్న సినిమాలో లీడ్ రోల్స్ ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.